టాలీవుడ్ జక్కన్న రాజమౌళి(Rajamouli) అనుకున్నది సాధించారు.అంతర్జాతీయ స్థాయిలో తన ఆర్ఆర్‌ఆర్ (RRR) సినిమాకు గుర్తింపు తీసుకు రావాలని ఆయన తీసుకున్న బలమైన నిర్ణయం.
ఆయన కోరిక సాకారమయ్యింది.అద్భుతాలను ఆవిష్కరించడం జక్కన్నకు కొత్తేం కాదు.
ఆ అద్భుతాలు ఆయనకే సాధ్యం అని మరోసారి నిరూపితం అయ్యింది.ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ వారు ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ కు(Oscar) నామినేట్ చేయక పోయినా కూడా పట్టుదలతో తానే స్వయంగా ఆస్కార్ కు పంపించడం జరిగింది.
తాను కోరుకుంటే ఏదైనా సాధ్యమే అన్నట్లుగా ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు పాట కు చోటు దక్కింది.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా పాటకు దక్కని అరుదైన గౌరవం తెలుగు పాటు నాటు నాటుకు దక్కేలా చేయడం ఆయనకే చెల్లింది.ఫిల్మ్ ఫెడరేషన్ వారు ఆస్కార్ కు నాటు నాటు ను పంపక పోవడం పట్ల ఆయన ఒక్క మాట మాట్లాడలేదు.తమ ప్రయత్నం తాము చేస్తామంటూ చెప్పి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఆ క్రమంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది.నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా సర్ ప్రైజ్ అయ్యారు.
అవార్డ్ రాకున్నా పర్వాలేదు ఇదే గొప్ప అన్నట్లుగా మొదట భావించిన సినీ ప్రేమికులు ఆ తర్వాత ఆస్కార్ దక్కితే బాగుంటుందని ఆశ పడ్డారు.

అది అత్యాశ అవుతుందని కొందరు ఎద్దేవ చేశారు.నామినేషన్స్ వరకు వెళ్లడమే గొప్ప విషయం.ఆస్కార్ అంత సీన్ లేదు అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు.
రాజమౌళి యొక్క విజన్ ఆస్కార్ అవార్డు దక్కేలా చేసింది.తమ సినిమాలో స్టఫ్ ఉంది కనుక ప్రయత్నిద్దాం అనుకోవడమే ఆయన గొప్పతనం.
విజనరీ ని చూపిస్తుంది అనడంలో సందేహం లేదు.మొత్తానికి ఏ ఇండియన్ మూవీకి దక్కని గౌరవంను మన తెలుగు సినిమా నాటు నాటు పాటకు దక్కేలా చేసిన రాజమౌళికి ప్రతి ఒక్క సినీ ప్రేమికుడి తరపున కృతజ్ఞతలు.







