ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి దీటుగా అలియా పాత్ర

దర్శక దిగ్గజం రాజమౌళి తన సినిమాలలో పాత్రలని తీర్చి దిద్దే విధానం అద్బుతంగా ఉంటుంది.చిన్న నటుడైన, చేసేది ఒకే సన్నివేశంలో అయిన కచ్చితంగా ఆ పాత్ర సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకి గుర్తుండిపోతుంది.

 Rajamouli Says Alia Bhatt Role Very Crucial In Rrr Movie, Jr Ntr, Ram Charan, To-TeluguStop.com

అలాంటి పాత్రలతో ఎమోషనల్ కవరింగ్ ఇవ్వడంలో జక్కన్న సిద్ధహస్తుడు.ఇక అతని సినిమాలో హీరోయిన్స్ పాత్రలకి కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది.

హీరోలతో సమానంగా హీరోయిన్స్ పాత్రలు ఉంటాయి.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ పాత్ర కూడా అలాగే ఉంటుందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ చిత్ర సంగతులపై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ప్రతిభావంతుల మధ్య వారికి దీటుగా నిలిచే నటి కావాలనుకున్నామని, అమాయకంగా ఉంటూనే, తెగువ ప్రదర్శించగల అమ్మాయి పాత్రలో సరిపోయే హీరోయిన్ కోసం చూస్తున్నప్పుడు అలియా భట్ పెర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశామని వివరించారు.రామ్ చరణ్ కి జోడీగా అలియా పాత్ర ఉన్న కూడా అల్లూరి, రామరాజు పాత్రలతో పోటీ పడే విధంగా ఉండబోతుంది అని తెలిపారు.

ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం అలియాపై షూటింగ్ చేయాల్సి ఉండగా, లాక్ డౌన్ కారణంగా రద్దయిందని తెలిపారు.వాస్తవానికి ఈ నెలలో అలియాపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని తెలియజేశారు.

అలియాతో పని చేయడం కోసం ఎదురుచూస్తున్నాం అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube