తగ్గేదే లే అంటున్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డి...

తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ గురించి తెలయని వారుండరంటే అతిశయోక్తి కాదు.అంతలా తమ మాటలతో వారు రాష్ర్ట రాజకీయాల్ని శాసించారు.

కానీ ప్రస్తుతం ఈ బ్రదర్స్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు ఉంది.అప్పట్లో అన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఆశించి ఢిల్లీ వరకు పోయి వచ్చినా.

ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.ఆయన్ను కాదని అధిష్టానం రేవంత్ రెడ్డి కి పదవిని కట్టబెట్టింది.

దీంతో వెంకట్ రెడ్డి అలక వహించారు.ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత అసలు పీసీసీ చీఫ్ పదవి అమ్ముడు పోయిందని తాను ఎట్టి పరిస్థితుల్లో నూతన చీఫ్ రేవంత్ రెడ్డికి సహకరించనని అన్నారు.

Advertisement

రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పై కూడా విమర్శలు చేశారు.ఈయన విమర్శలతో అప్పట్లో అధిష్టానం కూడా సీరియస్ అయింది.

దీంతో వెంకట్ రెడ్డి కాస్త వెనక్కు తగ్గారు.మొన్నీ మధ్య తాను పీసీసీ పదవి రాలేదనే కోపంతో అలా వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు.

కానీ ఆయన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎంతకీ తగ్గడం లేదు.తన అన్నకు పదవి రాకపోయే సరికి ఆయన బాగా హర్ట్ అయినట్టున్నారు.

ఈ మధ్య వేరే పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు పోన్ చేసి నిరుద్యోగ దీక్షకు మద్దతు తెలిపారు.అన్ని విధాలుగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

అంతే కాకుండా నిరుద్యోగ దీక్షను తన నియోజకవర్గంలో చేయడం సంతోషమని చెప్పారు.పనిలో పనిగా కేసీఆర్ పాలనపై కూడా నిప్పులు చెరిగారు.

Advertisement

టీఆర్ఎస్ వచ్చాక కేవలం వారి కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.

తాజా వార్తలు