'రాజ్ దూత్' ట్రైలర్ రిలీజ్....మాస్ లుక్ లో మేఘాంశ్ అదుర్స్

సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీహరి.ఆయన చిన్న వయస్సు లోనే హఠాత్తుగా 2013 లో కన్నుమూశారు.

 Raj Dooth Trailer Release-TeluguStop.com

ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.అయితే శ్రీహరి పెద్ద కుమారుడు మేఘాంశ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

చైల్డ్ ఆర్టిస్ట్ గా భైరవ సినిమా లో పరిచయం అయిన మేఘాంశ్ ఇప్పుడు హీరో గా వెండితెర కు పరిచయం అవుతున్నాడు.

‘రాజ్ దూత్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ పక్కన లెదర్ Raj, జీన్ ప్యాంటు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న మేఘాంశ్ రఫ్ లుక్ లో అదుర్స్ గా క‌నిపిస్తున్నాడు.తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత కాలం సినిమాల‌కి దూరంగా ఉన్న మేఘాంశ్ ఇప్పుడు రాజ్‌దూత్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

కొన్నాళ్ళ పాటు న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న మేఘాంశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తుండగా కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ నిర్మిస్తున్నారు .రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ చిత్రంలో మేఘాంశ్ పూర్తి మాస్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం.

తెలుగు సినీ పరిశ్రమ లో శ్రీహరి కు ఉన్న పేరును మేఘాంశ్ నిలబెడతాడా లేదా అన్న విషయం తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube