హైదరాబాద్ లో మళ్లీ వర్షం

హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది.నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్ గూడ, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ లో వర్షం పడుతోంది.అదేవిధంగా సికింద్రాబాద్, నేరేడ్ మెట్, తిరుమలగిరి, అల్వాల్ తో పాటు కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్ మరియు సూరారంలోనూ వాన కురుస్తోంది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మళ్లీ వర్షం కురుస్తుండటంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అన్ని సర్కిళ్ల అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

దాంతో పాటు వర్షాలపై కంట్రోల్ రూమ్ నంబర్లు 040 - 21111111, 9000113667 ఏర్పాటు చేసింది.

Advertisement
త్రివిక్రమ్ సునీల్ 30 రూపాయల అనుభవం తెలుసా.. ఇన్ని కష్టాలు అనుభవించారా?

తాజా వార్తలు