రైల్వేశాఖ( Indian Railways )లో ఉద్యోగాల భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి.వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉండే ఉద్యోగాలకు ఆయా జోన్లు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంటాయి.
అలాగే దేశవ్యాప్తంగా రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు రైల్వే బోర్డు నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉంటుంది.అలాగే వివిధ రైల్వే జోన్లలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన కూడా ఉద్యోగులను తీసుకుంటూ ఉంటారు.
రైల్వేలో ఎప్పుడే ఏవోక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి.అందులో భాగంగా తాజాగా రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది.

వెస్ట్రన్ రైల్వేస్ అప్రెంటీస్ పోస్టులను( Western Railway ) భర్తీ చేస్తోంది.ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణణ సాధించినవారు అర్హులు.ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్ మేన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మేన్, ఇతర ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతోంది.ఈ పోస్టులకు ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూలు ఉండవు.
టెన్త్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.టెన్త్ పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.
దాదాపు 3,624 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.ఆన్ లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి.ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.
జులై 26వ తేదీలోపు అప్లికేషన్ ప్రక్రియకు గడువు ఇచ్చారు.ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం వెస్ట్రన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ( Central Govt Job )సంపాదించాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.







