Rahul Gandhi : భారత్ ప్రజాస్వామ్య దేశమన్నది అతిపెద్ద అబద్ధం..: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Congress Leader Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నది అతి పెద్ద అబద్ధమని ఆయన అన్నారు.

దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యమే లేదని తెలిపారు.కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్లు( Congress bank Accounts ) అన్నింటినీ స్తంభింపజేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

ఇది ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) నేరపూరితమైన చర్యని ఆరోపించారు.తమ అకౌంట్లను స్తంభింపజేయడం వలన ఎన్నికల ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు.

అంతేకాకుండా కార్యకర్తలకు, అభ్యర్థులకు సపోర్ట్ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు.దేశంలో ఇరవై శాతం ఓట్లు కాంగ్రెస్ కు ఉన్నాయన్న రాహుల్ గాంధీ రూ.2 కూడా దేనికీ చెల్లించే స్థితిలో లేమని వెల్లడించారు.ఇది కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేయడమని తెలిపారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు