ప‌ట్టాభిషేక‌మే త‌రువాయ‌ట‌.....?

కాంగ్రెస్ పార్టీలో యువరాజుకు పట్టాభిషేకం చేసేందుకు అంతా సిద్ధ‌ప‌ర‌చిన‌ట్టు ఉంద‌ని, ఇక ప‌గ్గాలురాహుల్ గాంధీ చేప‌ట్ట‌డ‌మే త‌రువాయిగానే క‌నిపిస్తోంది.తన నియోజకవర్గం రాయబరేలిలో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆమె దాదాపు ఈ విష‌య‌మై మీడియాకు కొంత స్ప‌ష్ట‌త ఇవ్వ‌డంతో త‌న త‌న‌యుడికి పార్టీని అందించేందుకు సిద్ధ‌మైన‌ట్లు క‌నిపిస్తోంద‌ని ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ బ‌లంగా సాగుతోంది.

 Rahul Gandhi Ready To Takeover Congress Party?-TeluguStop.com

,

ఇప్ప‌టికే కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న రాహుల్ గాంధీని జాతీయ అధ్య‌క్షుడిని చేయాల‌ని పార్టీలోని అనేక మంది కోరుతున్న విష‌యం మీడియా ప్ర‌శ్న‌ల‌కు మనం మనస్పూర్తిగా వారి నాయకత్వం ఆహ్వానిద్దాం… విష‌యం వచ్చినప్పుడు వివ‌రాలు చెప్తాన‌ని చెప్ప‌డంతో త్వ‌ర‌లో రాహుల్ అధ్య‌క్షుడిగా ప్ర‌మోట్ కావ‌టం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ శ్రేణులు కూడా భావిస్తున్నాయి.ఉత్తరప్రదేశ్ ఎన్నిక‌లలో చురుగ్గా పాల్గొన్న‌ ప్రియాంకా గాంధీ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టే అవకాశం ఉంద‌న్న వాద‌న‌లు, అనుమానాలూ దీంతో ప‌టాపంచ‌లైన‌ట్టే.

“మేము ఒకపెద్ద జాతీయ పార్టీ.దీనికి కొన్ని స్ప‌ష్ట‌మైన విధానాలు ఉన్నాయి … రేపు కాకుంటే ఎల్లుండి రాహుల్ నేతృత్వంలో మేము న‌డ‌వాల్సిందే క‌దా.

సరైన స‌మ‌యంలో నిర్ణ‌యం వెల్ల‌డిస్తామ‌న్నారు పార్టీ ప్రతినిధి సుస్మితా దేవ్

అంత వ‌ర‌కు “ఊహాగానాలు మీడియా హక్కు ” … క‌నుక ఊహ‌ల్లో తేలియాడండి అని వ్యాఖ్యానించారాయ‌న‌.గత 20 సంవత్సరాలుగా అధ్య‌క్షురాలిగా సోనియా పార్టీకి చేసిన సేవ‌లు అద్భుతం, రెండు ప‌ర్యాయాలు ఆమె నేతృత్వంలోనే అధికారంలోనికి వ‌చ్చి నిరాఘాటంగా పాల‌న సాగించిన విష‌యం గుర్తెర‌గాల‌న్నారాయ‌న‌.

ఇప్ప‌టికీ త‌ను ఏం మాట్లాడితే ఏం జ‌రుగుతుందో అని అంత‌ర్గ‌త మిత్రులు, స‌ల‌హాదారుల‌పైనే ఆధార‌ప‌డే రాహుల్ ఓ పెద్ధ జాతీయ పార్టీకి అధ్య‌క్షుడ‌యితే ఆయన సొంత నిర్ణయాలు ఎంత వ‌ర‌కు తీసుకుంటారన్న‌దీ పెద్ద ప్ర‌శ్న‌గా కాంగ్రెస్ నేత‌లోనే వినిపిస్తోంది.చూద్దాం ఏం జ‌ర‌గ‌నుందో….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube