కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చదువుకునేటప్పుడు స్కూల్లో కాపీ కొట్టారో లేదో మనకు తెలియదు.కానీ ఇప్పుడు కాపీ కొడుతున్నారట.
చదువులో కాదనే సంగతి తెలుసు.మరి ఎందులో కాపీ కొడుతున్నారు? రాజకీయ ప్రసంగాలు చేయడంలో.ఈ విషయంలో కాపీ కొడితే తల్లి సోనియాను లేదా తండ్రి రాజీవ్ గాంధీని కాపీ కొట్టాలి.కానీ ఆయన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీని కాపీ కొడుతున్నారట.
ఈ విషయం మంత్రిగారే చెప్పింది.ప్రసంగాలు చేయడంలో తనకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉందని, రాహుల్ తన మాదిరిగానే మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
రాహుల్ తన ప్రసంగాల శైలిని కాపీ కొడుతున్న విషయం తను గుర్తించానని మంత్రి చెప్పారు.దీన్ని కాపీ అనరు.
మంత్రి ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది.దాన్ని చూసి రాహుల్ ఇన్స్పైర్ అవుతున్నారేమో.