తెలంగాణలో తమదే అధికారం అంటున్న రాహుల్..!!

తెలంగాణ రాష్ట్రంలో( Telangana ) మరో నాలుగైదు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రజలలోకి వెళుతున్నాయి.

 Rahul Gandhi Confident In Telangana Assembly Elections Details, Rahul Gandhi, C-TeluguStop.com

మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి బీఆర్ఎస్( BRS ) అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.పరిస్థితి ఇలా ఉంటే కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఊహించని మెజారిటీ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తెలంగాణలో కూడా అదే రీతిలో గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది.

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.కాంగ్రెస్ పార్టీకి కీలక నేత రాహుల్ గాంధీ( Rahul gandhi ) ప్రస్తుతం న్యూయార్క్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో జాకబ్స్ జావిట్స్ లో జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఎన్నారై లకు మంచి రోజులు రాబోతున్నాయని స్పష్టం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి అవకాశాలు పెంచుతామని పేర్కొన్నారు.ఇండస్ట్రీలు, కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని స్పష్టం చేశారు.తెలంగాణలో ఈసారి తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని.రాహుల్ గాంధీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.ప్రజానాడిని కూడా తాము పసి గట్టినట్లు తెలిపారు.

దేశంలో ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్నారైలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.దేశంలో ప్రజా సంక్షేమం పరుగులు పెట్టాలంటే.

కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube