స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి టీడీపీ నేతలు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.
మరో పక్క లోకేష్( Nara lokesh ) సైతం ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో మంతనాలు జరుపుతున్నారు.సుప్రీంకోర్టులో సైతం బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నేత సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరా రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు స్వయం తప్పిదాల వల్లే జైలుకు వెళ్లారని పేర్కొన్నారు.2017వ సంవత్సరంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో సభ నిర్వహిస్తే చెప్పులు, రాళ్లు వేయించారు.న్యాయస్థానంలో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలి.
చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) విషయంలో తెలుగుదేశం పార్టీ చేసే దీక్షల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.చంద్రబాబు జైలు నుంచి విడుదల కాలేరు.ఆయన చేసిన తప్పిదాల కారణంగానే జైలు పాలయ్యారు.తాను తవ్విన గోతిలో తానే పడ్డారు.
కచ్చితంగా ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు జైలు నుంచి బయటకు రాలేరని రఘువీరారెడ్డి ( Raghuveera Reddy )వ్యాఖ్యానించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర విభజన జరిగినా అనంతరం ఏపిలో రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అనంతరం ప్రస్తుతం సొంతూరులో సాధారణ జీవితం గడుపుతున్నారు.
మే నెలలో కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా సీడబ్ల్యుసీ సభ్యుడిగా.
రఘువీరా రెడ్డి మరోసారి నియమితులయ్యారు.ఈ క్రమంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.