రోజురోజుకు వైసీపీ శ్రేణులు మరియురఘురామకృష్ణంరాజు మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది.గత కొద్దిరోజులుగా వైసీపీ రెబల్ ఎంపీ లా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణంరాజు జగన్ పై పార్టీ పెద్దల పై కులముద్రతో కూడిన విధంగా తీవ్ర అరోపణలు చేస్తున్నారు.
దీనికి బదులుగా వైసీపీ శ్రేణులు ఎంపీ పై పురుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు.ఈ వ్యవహారం ముదరక ముందే తన పార్టీ వారి నుండి తనకు రక్షణ కావాలని రఘురామకృష్ణంరాజు కేంద్రాన్ని కోరి తనకు కావాల్సిన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు.
ఇక తాజాగా మరోమారు ఏపీ సర్కార్ తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై స్పందించాలని కేంద్రాన్ని కోరారు.ఇంతకీ ఆయన ఈసారి ఏ విషయంలో కేంద్రాన్ని సహాయం కోరుతున్నారో ఇప్పుడు చూద్దాం.
ఏపీ సర్కారు తన పరిధిలో ఉన్న నిఘా వర్గాల చేత తన ఫోన్ ని టాప్ చేయించిందని ఇది ఆర్టికల్ 14,19,21 ను ఉల్లంఘించడమేనని తన పట్ల ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ ఆదివారం ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు.ఈ లేఖలో తనకు తరచూ వైఎస్ రెడ్డి అనే పేరుతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈయనను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి వైసీపీ ఢిల్లీలో అడుగులు వేస్తుంది.మరి అది సాధ్యమయ్యేనా లేదా అనేది తేలాల్సివుంది.