వైసీపీలో అలజడి ! సంబరపడుతున్న రఘురామ ?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో పుట్టిన ముసలం ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగానే మారింది.ఇప్పటికే వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు ఎగురవేశారు.

 Raghurama Krishnam Raju Comments Ysrcp Government , Raghurama Krishnam Raju, Ysr-TeluguStop.com

అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది నేతలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని,  త్వరలోనే పెద్ద ఎత్తున టిడిపిలో వైసీపీ నేతలు చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నాట్లుగా జరుగుతున్న ప్రచారం అధికార ప్రతి వైసీపీలో కలవరం పుట్టిస్తుంది.ఈ వలసలను నివారించేందుకు జగన్ ఆగమేఘాల మీద పార్టీకి సమన్వయకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

Telugu Anamramnarayana, Ap Cm Jagan, Ap, Jagan, Kotamsridhar, Ysrcp-Politics

ఎక్కడా, ఎవరిలోనూ అసంతృప్తి తలెత్తకుండా వాటిని పరిష్కరించే విధంగా పార్టీ సీనియర్ నాయకులకు బాధ్యతలను అప్పగించారు.మొత్తంగా వైసీపీలో ఆందోళన పరిణామాలు తలెత్తడంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు తనదైన శైలిలో స్పందిస్తున్నారు.ఏపీలోని తమ పార్టీలో అవమానాలు దిగమింగుకుంటూ ఉన్న వారంతా ఆత్మగౌరవంతో తిరగబడే రోజులు మొదలయ్యాయి అంటూ రఘురామ కృష్ణంరాజు అన్నారు.ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో ఈ తిరుగుబాటు ప్రారంభమైందని రఘురామ ఎద్దేవా చేశారు.

పార్లమెంట్ చట్టం ద్వారానే ఏపీ రాజధాని మార్పు సాధ్యమని మాజీ మంత్రి కొడాలి నాని కూడా గ్రహించారని రఘు రామ అన్నారు.

Telugu Anamramnarayana, Ap Cm Jagan, Ap, Jagan, Kotamsridhar, Ysrcp-Politics

సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే , రాబోయే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు , 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని కేంద్రంతో పార్లమెంటులో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా చేస్తామంటూ ఆయన  గుర్తు చేశారు.తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టిన వైసీపీలో ఈ తరహా పరిణామాలు చోటు చేసుకోవడం పై రఘురామ మరింత ఆనందంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube