ఏపీ లో ముందస్తు ఎన్నికలు( AP Early Elections ) జరిగి తీరుతాయి అంటూ ఈ మధ్య కాలంలో కొందరు రాజకీయ నాయకులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.ఆ విషయం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
ఒక వైపు వైకాపా నాయకులు అస్సలు ముందస్తు ఎన్నికల ఆలోచన లేదు అంటూ ప్రకటనలు చేస్తూ ఉంటే మరో వైపు తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు ముందస్తు ఖాయం అన్నట్లుగా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.వైకాపా ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే పడిపోవడం ఖాయం అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు చాలా బలంగా వాదిస్తున్నారు.

ఆ విషయం పక్కన పెడితే తెలంగాణ లో ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో అప్పుడే ఏపీ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నట్లుగా వైకాపా రెబల్ ఎంపీ రఘురామ రాజు( MP Raghurama Krishnam Raju ) చాలా నమ్మకంగా చెబుతున్నాడు.ఏపీ లో వైకాపా ప్రభుత్వం ను ఆగస్టు లో రద్దు చేసే ఆలోచనలో జగన్ ( CM Jagan ) ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తే గెలుపు ఖాయం అని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయని.అది కచ్చితంగా పగటి కల అవుతుందని ఈ సందర్భ రఘురామ అన్నారు.
పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు ఇప్పటికే ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.

కానీ అధికారికంగా మాత్రం బయటకు చెప్పడం లేదు అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి ఏపీ లో ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులతో పాటు ఆ పార్టీ రెబల్ ఎంపీ అయిన రఘురామ కూడా అంటున్నారు.అసలు విషయం ఏంటి అనేది మరో రెండు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ మరియు ఏపీ లో ఒకే సారి ఎన్నికలు జరిగితే తెలుగు ఓటర్లు ఎటు ఉంటారు అనేది చూడాలి.







