ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన రఘు కుంచె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో ఛాన్స్ వచ్చిన ఆ ఛాన్స్ ను నిలబెట్టుకోవాలని ఎంతో కష్టపడ్డారని అన్నారు.రవితేజలో ఉండే ఫైర్ వల్లే నేటికీ అతను ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నాడని రఘు కుంచె చెప్పుకొచ్చారు.
నేను మధురా నగర్ లో ఉండేవాడినని ఆయన తెలిపారు.పూరీ జగన్నాథ్ గారు కృష్ణానగర్ లో ఉండేవారని ఆయన అన్నారు.
నా దగ్గర 15,000 క్యాసెట్లు ఉన్నాయని ఆయన తెలిపారు.సండే రోజున పూరీ జగన్నాథ్ కు ఇంటినుంచి డబ్బులు వచ్చేవని ఆ డబ్బులతో అబిడ్స్ లో రోడ్డుపై అమ్మే పుస్తకాలను కొనటానికి వెళ్లేవాళ్లమని ఆయన అన్నారు.
పూరీ జగన్నాథ్ చాలా హోమ్ వర్క్ చేసేవారని ఆయన చెప్పుకొచ్చారు.పూరీ జగన్నాథ్ టైమ్ వేస్ట్ చేసేవారు కాదని ఎక్స్ట్రా మనీ కోసం పూరీ జగన్నాథ్ డిజైనింగ్ చేసేవారని ఆయన తెలిపారు.
అనుకోకుండా పూరీ జగన్నాథ్ తో తనకు ఫ్రెండ్ షిప్ కలిసిందని ఆయన అన్నారు.

రవితేజ చెన్నైలో ఉన్నాడని అక్కడినుంచి హైదరాబాద్ కు వచ్చాడని ఆయన చెప్పుకొచ్చారు. వి.వి వినాయక్ సాగర్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేసేవారని బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల కూడా తనకు పరిచయం ఉన్నవాళ్లేనని ఆయన అన్నారు.నాకు తెలిసిన వాళ్లందరినీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ అడిగానని ఆయన తెలిపారు.

పూరీ జగన్నాథ్ నా జీవితంలో కీ రోల్ పోషించారని ఆయన చెప్పుకొచ్చారు.పూరీ జగన్నాథ్ సెంటిమెంట్లను పట్టించుకోరని ఆయన తెలిపారు.గోలీమార్ సమయంలో తనకు ఛాన్స్ ఇచ్చారని అయితే చక్రి ఆ సమయంలో ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉన్నారని అందువల్ల తనను తొలగించి చక్రికి ఆయన ఛాన్స్ ఇచ్చారని రఘు కుంచె చెప్పుకొచ్చారు.







