ఈసారి బిగ్‌బాస్‌ లోనూ జంట ఉండనుందా?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 వచ్చే నెల చివరి వారంలో ప్రారంభం కాబోతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.

కంటెస్టెంట్స్‌ ఇప్పటికే ఫైనల్‌ అయ్యారు.వారితో అగ్రిమెంట్‌ జరుగుతోంది.

త్వరలోనే ప్రోమో కూడా ప్రసారం కాబోతుంది.నాగార్జున ఈ సీజన్‌ కు హోస్ట్‌గా కొనసాగబోతున్నాడు.

గత సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్‌ దృష్ట్యా పలు విషయాలను ఈ సీజన్‌లో కూడా కంటిన్యూ చేస్తున్నారు.ముఖ్యంగా గత సీజన్‌లో కపుల్‌ ను హౌస్‌లోకి పంపించారు.

Advertisement

ఈసారి కూడా కపుల్‌ను పంపించే విషయమై చర్చ జరుగుతోంది.గత సీజన్‌లో హీరో వరుణ్‌ సందేశ్‌ ఆయన భార్య వితిక షేరులు కంటెస్టెంట్స్‌ గా కలిసి వెళ్లారు.

వారి ఎంట్రీతో మంచి టాక్‌ వచ్చింది.వారి కోసం కూడా చాలా మంది షోను చూశారు అనే టాక్‌ నడిచింది.

అందుకే ఈసారి కూడా కపుల్‌ ఉంటే మరింత ఎంటర్‌టైనింగ్‌గా షో ఉంటుందనే నమ్మకంతో నిర్వాహకులు ఉన్నారు.అందుకే షో కోసం కొరియోగ్రాఫర్‌ రఘు మరియు ఆయన భార్య ప్రణవిలు ఎంటర్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇద్దరు కూడా సెలబ్రెటీలు అవ్వడం వల్ల ప్రేక్షకులకు సుపరిచితు.ఆ కారణంగానే ఈ జంటను షోకు ఎంపిక చేశారనే టాక్‌ వినిపిస్తుంది.త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest

ఈ జంట కాకుంటే మరో జంట పేరు కూడా పరిశీలనలో ఉంది.త్వరలోనే ఆ జంట విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

రెండు జంటలను ఈసారి ఆడిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుందట.మొత్తానికి మస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసేందుకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.

తాజా వార్తలు