తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల దర్బార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ హిట్ అందుకున్నాడు.కాగా ప్రస్తుతం దర్శకుడు శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న రజినీ తన నెక్ట్స్ మూవీలను కూడా లైన్‌లో పెడుతున్నాడు.
తాజాగా రజినీతో ఓ సినిమా చేసేందుకు ఆయన వీరాభిమాని రెడీ అవుతున్నాడు.
ఇంతకీ ఆ వీరాభిమాని ఎవరు అని అనుకుంటున్నారా? తమిళ నటుడు కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.కాగా రజినీకాంత్ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని రాఘవ చాలాసార్లు తెలియజేశాడు.అయితే రజినీకాంత్‌తో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలని భావిస్తున్న లారెన్స్ ఎట్టకేలకు ఆయన కలను నేరవేర్చుకోనున్నాడు.
అయితే రజినీ 169వ చిత్రాన్ని ఖైదీ ఫేం లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తుండగా 170వ చిత్రాన్ని లారెన్స్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇలా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేయాలనే తన కలను ఎట్టకేలకు రాఘవ నెరవేర్చుకోవడాన్ని చూసి ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని కోలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.







