బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పరిణితి చోప్రా( Parineethi Chopra ) ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా( Raghav Chadha ) వివాహం మరికొన్ని గంటలలో ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది.ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి.
వీరి వివాహం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో ఘనంగా జరగబోతోంది.ఇక ఈ వివాహ వేడుకకు ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.
ఇలా పెద్ద ఎత్తున వివిఐపీలు రావడంతో సెక్యూరిటీ పరంగా భారీ భద్రతా చర్యలను కూడా చేపట్టారు.
పరిణితి చోప్రా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు స్టార్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారు.అలాగే రాఘవ్ ఎంపీ కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి పలువురు ముఖ్యమంత్రిలు ఇతర నాయకులూ కూడా ఈ పెళ్లికి హాజరుకానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు.ఇక ఇది రాయల్ వెడ్డింగ్ కావడంతో ఈ పెళ్లి విషయంలో రాఘవ్ పరిణితి ఎన్నో భద్రతా చర్యలతో పాటు పెళ్లికి వచ్చే అతిధులకు కొన్ని కండిషన్లు( Conditions )కూడా పెట్టినట్టు తెలుస్తుంది.
ఈ పెళ్లికి హాజరయ్యే అతిధులందరి సెల్ఫోన్ కెమెరాలకు రెడ్ స్టిక్కర్ అతికించారు ఎవరూ కూడా ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను తీయడానికి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు.అదేవిధంగా ఈ వెడ్డింగ్ ఈవెంట్లో పాల్గొన్నటువంటి సెక్యూరిటీ మూడు రోజులపాటు ఎక్కడ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఒకవేళ ఎవరైనా పెళ్లి సమయంలో మొబైల్ ఫోన్ కి ఉన్నటువంటి రెడ్ స్టిక్కర్ కనుక తీసేస్తే వెంటనే సెక్యూరిటీకి అలెర్ట్ వెళ్లే లాగా ఏర్పాట్లు చేశారు.ఈ విధంగా వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటికి రాకుండా ఉండటం కోసమే వీరిద్దరూ ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా పెళ్లికి వచ్చే అతిధులకు ఈ కండిషన్లు పెట్టారని తెలుస్తోంది.