హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Party ) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.విచారణలో భాగంగా గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అయినట్లు గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ ( Abdul )హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు ప్రస్తుతం నిందితుడు గోవా జైలులో ఉన్నాడని తెలిపారు.అబ్దుల్ నుంచే రహ్మన్, మీర్జా, ప్రవీణ్, అబ్బాస్ మరియు వివేకానందకు డ్రగ్స్ వచ్చాయని పోలీసులు నిర్దారించారు.
అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్ బేగ్ స్నాప్ చాట్ లో చాటింగ్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.