ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు.
అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మను ఊరు- మన బడి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆమె తెలిపారు.
చట్టపరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడం లేదని మంత్రి సబితా ఆరోపించారు.