సాధారణంగా అభిమానులు వారి అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి అని తెగ తాపత్రయపడుతూ ఉంటారు.వారి అభిమాన సెలబ్రిటీల జీవితం ఎలా ఉంటుంది? అలాగే వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వాటి గురించి కూడా తెలుసుకోవాలని ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.ఇకపోతే సాధారణంగా అభిమానులు వారి సెలబ్రిటీలకు ఏదైనా అయ్యి వార్తలు కాస్త నెగిటివ్ గా వినిపించాయి అంటే చాలు ఆ వార్తల పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు.అంతేకాకుండా వారి అభిమాన ఆరోగ్యానికి సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటారు.
ఇకపోతే ఇటీవల తెలుగు బుల్లితెర యాంకర్ లాస్య హాస్పిటల్ లో చేరిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.కానీ ఆమెకి ఏమి అయ్యింది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.
లాస్య కి బాగాలేదు అన్న విషయం ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ త్వరగా కోలుకోవాలి అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో ని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.అందులో లాస్య బెడ్ పై పడుకొని కనిపించేసరికి.
సోషల్ మీడియాలో నెగటివ్ వార్తలు స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు.లాస్య పరిస్థితి విషమంగా ఉందని, బెడ్ పై నుండి లేవలేని స్థితిలో ఉందంటూ కథనాలు వెలువడ్డాయి.

తాజాగా తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లపై లాస్య స్పందిస్తూ.ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని, తనకి వచ్చింది కేవలం వైరల్ ఫీవర్ మాత్రమేనని.దయచేసి అలాంటి నెగటివ్ వార్తలు స్ప్రెడ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇకపోతే లాస్య విషయానికి వస్తే.మొదట బుల్లితెరపై యాంకర్ గా కెరిర్ ను ప్రారంభించిన లాస్య ఆ తర్వాత బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.చీమ, ఏనుగు లాంటి జోకులతో లాస్య బాగా ఫేమస్ అయ్యింది.
ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన లాస్య ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో కామెడీ చేస్తూ దూసుకుపోతోంది.







