హీరోయిన్ గా పలు సినిమా ల్లో నటించిన అక్కినేని అమల ఈ మధ్య కాలంలో సినిమాల్లో చాలా రేర్ గా మాత్రమే కనిపిస్తున్నారు.నాగార్జునతో వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు.
కుటుంబ వ్యవహారాలు మరియు వ్యాపారాలకు సంబంధించిన విషయాలను మాత్రమే ఆమె చూసుకుంటున్నారు.సినిమా ల్లో ఆమె రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నా కూడా ఆమె మాత్రం ఆచి తూచి సినిమా లను ఎంపిక చేసుకుంటూ ఉన్నారు.
ఆమె సినిమాల ఎంపిక విషయం లో కొందరు విమర్శలు చేస్తున్నారు.ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తూ ఉంటే మీరు మాత్రం ఎందుకు సినిమా లు చేయరు మేడం అంటూ చాలా మంది ఆమెను కామెంట్స్ చేసిన వారు ఉన్నారు.

ఇప్పుడు ఒకే ఒక జీవితం సినిమా తో శర్వానంద్ కు అమ్మగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.విభిన్నమైన సినిమా అది కూడా ఆకట్టుకునే పాత్ర అవ్వడం వల్లే సినిమా లో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.అంతే కాకుండా పెద్ద హీరోలు దాదాపుగా తన వయసుకు సమానమైన హీరోలకు తల్లి పాత్రలను పోషించేందుకు ఆసక్తిగా లేను అంటూ అమల చెప్పుకొచ్చింది.హీరోయిన్ గా తాను ఎన్నో మంచి సినిమా ల్లో నటించింది.
కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం తక్కువ సినిమా లను చేసే ఉద్దేశ్యంతో ఈమె సినిమా లను ఎక్కువగా కమిట్ అవ్వడం లేదు.ఒకే ఒక జీవితం తో సక్సెస్ ను దక్కించుకుంటే ముందు ముందు ఈమె అమ్మ పాత్ర లకు సెటిల్ అవ్వచ్చు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు అమల అక్కినేని త్వరలోనే అఖిల్ అక్కినేని సినిమా లో అమ్మ పాత్రలో కనిపించాలని కోరుకుంటున్నాం అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.







