యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.
ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
.
ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మొదటి సాంగ్ నవంబర్ 15న విడుదల చేస్తామని ప్రకటించడంతో ఆనందంగా ఉన్నారు.ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మన్నన్ భరద్వాజ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా మ్యూజిక్ అందించడం కోసం ఎంత కష్టపడ్డాడో అంత ఈ పోస్ట్ ద్వారా వివరించాడు భరద్వాజ్.

ఈ సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడని తెలిపాడు.ఒక్క పాట కోసం పదుల కొద్దీ వర్షన్ లను రెడీ చేసి.ఎన్నో రికార్డింగ్ లు.ఎన్నో ఎడిట్స్ తర్వాత రాధేశ్యామ్ కోసం చర్చలు జరిపి మరి మ్యూజిక్ ను రెడీ చేసాం అని ఈ మ్యూజిక్ ఖచ్చితంగా అందరిని అలరిస్తుందని నమ్మకంతో ఉన్నామని తెలిపాడు.మొదటి నుండి నిర్మాతలు ఈ సినిమా కోసం అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

అన్నట్టుగానే ఈ సినిమా కథను మ్యాచ్ అయ్యే విషంగా చాలా వర్షన్ లను రెడీ చేసి చివరకు ఒకదాన్ని ఫైనల్ చేయడం జరిగిందట.అన్ని కూడా అద్భుతంగా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల నుండి కూడా సమాచారం అందుతుంది.అలాగే సౌత్ భాషల వారికీ ఒక వెర్షన్, నార్త్ ప్రేక్షకులకు మరొక వెర్షన్ రెడీ చేయించారట.మరి మొదటి సాంగ్ విడుదల అయితే కానీ మ్యూజిక్ ఏ విధంగా ఉందొ చెప్పవచ్చు.
అప్పటి వరకు వేచి ఉండాల్సిందే.