ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన భాగ్యశ్రీ

ప్రేమ పావురాలు సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన హీరోయిన్ భాగ్యశ్రీ.

ఆ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఈమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరం అయిపొయింది.

చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాలీవుడ్ లో తనకున్న పరిచయాలని ఉపయోగించుకుంటుంది.పనిలో పనిగా తాను కూడా నటిగా రీఎంట్రీ ఇవ్వబోతుంది.

ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమాలో హీరో తల్లిగా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాలో ఆమె పాత్రకి సంబందించిన సన్నివేశాలు పూర్తయినట్లు తెలుస్తుంది.

ఇక త్వరలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో మొదలవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పై నటి భాగ్యశ్రీ ప్రశంసలు కురిపించారు.

Advertisement

బాహుబలి సినిమా చూసినప్పుడే ప్రభాస్ పై తనకు ఒక మంచి అభిప్రాయం కలిగిందని చెప్పారు.ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడని అన్నారు.

అయితే ఒక సూపర్ స్టార్ కు ఉండే గర్వం, అహంకారం అతనిలో లేవని చెప్పారు.ప్రభాస్ ఎంతో నిరాడంబరంగా ఉంటాడని అతని కలుపుగోలుతనం, మర్యాద ఇచ్చే పద్ధతిని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.

అందరితో కలుపుగోలుగా మాట్లాడతాడని అతనొక టీమ్ ప్లేయర్ అని కితాబునిచ్చారు.ప్రభాస్ పద్ధతిని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు.

మొత్తానికి ప్రభాస్ సినిమాలో చేస్తూ అతని వ్యక్తిత్వంపై భాగ్యశ్రీ చేసి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు