స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఆడియెన్స్.త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ చాలా ఆతృతగా చూస్తున్నారు.
ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో మూడోసారి జతకడుతున్న త్రివిక్రమ్-బన్నీ ప్రేక్షకులకు మాత్రం అదిరిపోయే ట్రీట్‌లు ఇస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా మొదటి పాట తెలుగు ‘సామజవరగమన’ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ములేపిన విషయం తెలిసిందే.
కాగా తాజాగా ఈ సినిమా నుండి రాములో రాములా సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.అయితే ఈ పాట మాస్ ఆడియెన్స్‌లలో భీబత్సమైన ఫాలోయింగ్‌ను ఇప్పటికే క్రియేట్ చేసింది.
ఇక ఫుల్ సాంగ్ కూడా దీపావళి పండగ పూట రిలీజ్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు.ఈ పాటను ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ దూసుకుపోతున్నారు.
థమన్ అద్భుతమైన సంగీతం, అంతే అద్భుతంగా పాడిన అనురాగ్ కుల్కర్ణి, మంగ్లీలు ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు.సాధారణ ప్రేక్షకులు సైతం ఈ పాటను ఆస్వాదించేలా థమన్ చక్కటి సంగీతం అందించి శభాష్ అనిపించుకున్నాడు.
పండగ పూట ఇలాంటి మాస్ సాంగ్ ఒక్కటి పడితే చాలు అనుకునే వాళ్లకు మాత్రం ఇది పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి.ఇక ఈ పాటను మీరు ఓసారి విని ఆస్వాదించండి.
.