ఆగం చేస్తున్న రాములో రాములా పాట

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఆడియెన్స్.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ చాలా ఆతృతగా చూస్తున్నారు.

ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో మూడోసారి జతకడుతున్న త్రివిక్రమ్-బన్నీ ప్రేక్షకులకు మాత్రం అదిరిపోయే ట్రీట్‌లు ఇస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా మొదటి పాట తెలుగు ‘సామజవరగమన’ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ములేపిన విషయం తెలిసిందే.కాగా తాజాగా ఈ సినిమా నుండి రాములో రాములా సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

అయితే ఈ పాట మాస్ ఆడియెన్స్‌లలో భీబత్సమైన ఫాలోయింగ్‌ను ఇప్పటికే క్రియేట్ చేసింది.

ఇక ఫుల్ సాంగ్ కూడా దీపావళి పండగ పూట రిలీజ్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు.

ఈ పాటను ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ చేస్తూ దూసుకుపోతున్నారు.థమన్ అద్భుతమైన సంగీతం, అంతే అద్భుతంగా పాడిన అనురాగ్ కుల్కర్ణి, మంగ్లీలు ఈ పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు.

సాధారణ ప్రేక్షకులు సైతం ఈ పాటను ఆస్వాదించేలా థమన్ చక్కటి సంగీతం అందించి శభాష్ అనిపించుకున్నాడు.

పండగ పూట ఇలాంటి మాస్ సాంగ్ ఒక్కటి పడితే చాలు అనుకునే వాళ్లకు మాత్రం ఇది పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి.

ఇక ఈ పాటను మీరు ఓసారి విని ఆస్వాదించండి.iframe Src="https://!--wwwyoutube!--com/embed/wFAj0pW6xX0" Width="560" Height="315" Frameborder="0" Allowfullscreen="allowfullscreen"/iframe.