ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీలలో విభేదాలు,గొడవలు ఎక్కువ అవుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో గొడవలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వినిపించగా తాజాగా అల్లు అరవింద్ ఫ్యామిలీ లో కూడా కాస్త సీరియస్ గానే గొడవలు జరుగుతున్నాయి అంటూ సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.
తండ్రి అల్లు అరవింద్, అన్నయ్య అల్లు అర్జున్ మాట కాదని అల్లు శిరీష్ తన సొంత దారిలో నడుస్తున్నాడని అది అల్లు అరవింద్ కు నచ్చడం లేదని తెలుస్తోంది.
అంతే కాకుండా అల్లు ఫ్యామిలీలో కూడా ముగ్గురు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉండటం వల్లే వారు గత కొద్దిరోజులుగా ముగ్గురు కలిసి ఒకే స్టేజిపై కనిపించలేం లేదు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ముగ్గురులో ఒకరు స్టేజిపై కనిపిస్తే మరొక ఇద్దరు మాత్రం కనిపించడం లేదు.ఒకరు ఒక చోటు ఉంటే మరొక ఇద్దరు మరొకచోట ఉంటున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా వినాయక చవితి పండుగ సందర్భంగా అల్లు అరవింద్ ఆఫీసులో గణేష్ పూజను ఘనంగా నిర్వహించారు.ఆ పూజా కార్యక్రమానికి కేవలం హీరో అల్లు అర్జున్ మాత్రమే పాల్గొన్నారు.

ఇక పెద్దబ్బాయి, అల్లు శిరీష్ కనిపించకపోయేసరికి అసలు అల్లు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అంటూ వార్తలు మొదలయ్యాయి.కాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ తన ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు విభేదాలు లేవు అని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా విభేదాల కారణంగానే అల్లు శిరీష్ ని అల్లు అరవింద్, అల్లు అర్జున్ కూడా పక్కన పెట్టేశారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఈ వార్త పై అల్లు శిరీష్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.అలాగే అల్లు శిరీష్ సినిమాలలో కూడా నటించడం లేదు.మొత్తానికి అల్లు శిరీష్ జాడ కనిపించకుండా ఉంది.