నేడే క్వాలిఫయర్ వన్ మ్యాచ్.. గుజరాత్ వర్సెస్ చెన్నై..!

ఐపీఎల్( IPL ) సీజన్లో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి.నేటి నుంచి ప్లే ఆఫ్( Playoffs ) మ్యాచులు ప్రారంభం అవనున్నాయి.

 Qualifier One Match Today Gujarat Vs Chennai Details, Ipl Latest News,ipl Playof-TeluguStop.com

నేడు చెపాక్ వేదికగా 7:30 గంటలకు చెన్నై వర్సెస్ గుజరాత్( CSK vs GT ) మధ్య క్వాలిఫయర్ వన్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళుతుంది.

ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచే జట్టుతో పోటీ పడనుంది.ఇక నాలుగుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై సై అంటే గుజరాత్ జట్టు కూడా సై అంటోంది.

ఈరోజు జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది.రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో రెండింటి మధ్య గట్టి పోటీ ఉండనుంది.

ఇదిలా ఉండగా గుజరాత్ ఓపెనర్ అయిన శుబ్ మన్ గిల్( Shubman Gill ) నేడు జరిగే మ్యాచ్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.గిల్ ఆదివారం బెంగుళూరు జట్టుపై సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సీజన్ ఆరంభంలో పెద్ద స్కోర్లు చేయడంలో కాస్త విఫలం అయ్యానని, కానీ చెపాక్ స్టేడియంలో చెన్నై పై 40,50 స్కోర్లు నమోదు చేశానని తెలిపాడు.ఇప్పుడు ఫామ్ లో ఉండడంతో ఇంకాస్త అద్భుత ఆటను ప్రదర్శించి స్కోరు కాస్త అధికంగానే చేస్తానని తెలిపాడు.

Telugu Csk Gt Ups, Ipl Latest, Ipl Playoffs, Iplqualifiers, Latest Telugu, Shubm

నేడు జరిగే మ్యాచ్ కోసం ఎంతగానో ఆతురతగా ఎదురుచూస్తున్నానని తెలుపుతూ తనకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని పేర్కొన్నాడు.ఇక తమ జట్టు ప్లేయర్ల విషయానికి వస్తే బౌలింగ్ పరంగా తమ జట్టు అత్యంత పటిష్టంగా ఉందని, చెన్నై వికెట్లను త్వరగా తీస్తారని తాను భావిస్తున్నట్టు తెలిపాడు.నేడు జరిగే మ్యాచ్లో గెలిచి రెండోసారి ఫైనల్ కు వెళ్తామని గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరొకవైపు చెన్నై జట్టు కూడా సొంత గడ్డపై గెలిచి నేరుగా ఫైనల్ కు వెళ్లాలని కాస్త పట్టుదలగానే ఉంది.

ఈ సీజన్ ఆరంభంలో అహ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ గుజరాత్- చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిన సంగతి తెలిసిందే.నేడు జరిగే మ్యాచ్ లో గెలిచి గుజరాత్ కు షాక్ ఇవ్వాలని చెన్నై పట్టుదలగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube