పాముల దెబ్బకు కూలిపోయిన పైకప్పు!

ఇటీవల కాలంలో పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయ్.ఇన్నాళ్లు ఎక్కడో మానవ సంచారం లేని చోట నివసించే పాములు వర్షాలకు బయటపడుతున్నాయి.

 Two Pythons Fighting Over The Female Ceiling Crashed Two Pythons Fighting, Femal-TeluguStop.com

సాధారణంగానే పాములు అంటే మనుషులకు చచ్చేంత భయం.ఒక్క పాము కనిపించిన సరే మనిషి పరుగు తీస్తాడు.అది మనిషి స్వభావం.

అలాంటిది పాములకే భయపడే మనం పెద్ద పెద్ద అనకొండలకు భయపడమా ? గుండె జబ్బులు వంటివి ఉంటే అక్కడే కుప్పకూలిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు.ఇక ఈ నేపథ్యంలోనే రెండు పెద్ద పెద్ద కొండ చిలువలు ఇంట్లోకి వచ్చాయి.సీలింగ్‌కు వేలాడి కొట్లాడుతూ కనిపించాయి.షాక్ కి గురయ్యి బెదిరిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కి చెందిన డేవిడ్‌ టైట్‌ అనే వ్యక్తి పని మీద బయటకు వెళ్లాడు.తిరిగి ఇంటికి వచ్చాడు.

అయితే సీలింగ్ కి రెండు అనకొండలు చుట్టుకొని గొడవ పడుతున్నాయి.దీంతో అతను బయపడి బయటకు పరుగులు తీశాడు.

వెంటనే పాములు పట్టే వారికి సమాచారం అందించడంతో వారు వచ్చి పట్టుకున్నారు.

అనంతరం అవి రెండు మగ పాములు అని, ఆడపాము కోసం కొట్టుకుంటున్నట్టు పాములు పట్టుకునే వ్యక్తి చెప్పాడు.

అయితే ఆడ పాము కనిపించలేదని కచ్చితంగా చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube