అనకొండ, కొండచిలువ( Python ) పాములు కోతులను ఇష్టంగా తింటుంటాయి.నీటిలో ఇవి దాక్కుని నీరు తాగడానికి వచ్చిన కోతులను వెంటనే కాటేసి, ఆపై శరీరం మొత్తాన్ని చుట్టుకొని వాటిని చంపేస్తాయి.
తర్వాత మింగేస్తాయి.అడవిలో ఒకటి బతకాలంటే మరొక జీవి ఆహారం అవ్వక తప్పదు.
ఇది ప్రకృతి ధర్మం కాబట్టే మనుషులు కూడా వాటి మనుగడలో జోక్యం చేసుకోరు.అయితే తాజాగా మనుషులు ఒక కోతి పాము విషయంలో జోక్యం చేసుకున్నారు.
దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.అందులో కోతిని ఒక కొండచిలువ చుట్టేసింది.
ఆ సమయంలో కోతి హెల్ప్ కోసం అర్థనాదాలు పెట్టడం వినిపించింది.దీనిని గమనించిన స్థానికులు కోతిని పాము నుంచి విడిపించారు.
దీనికి సంబంధించిన వీడియోను @theedarkcircle ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

ఆ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక నీటి గుంట ఒడ్డును చేరుకొని కోతి చాలా బాధగా ఏడుస్తుండడం, అరుస్తుండడం మనం చూడవచ్చు.దాని చుట్టూ కొండచిలువ బలంగా చుట్టుకుంది.విడిపించుకోవడానికి, బతకడానికి అది ఎంతో తపన పడుతోంది.
ఆ హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు చలించి పోయారు.పామును, కోతిని రెండిటినీ బయటికి తీసుకొచ్చి విడిపించారు.
ఆ దృశ్యాలు కూడా వీడియోలో కనిపించాయి.

అయితే ఈ వీడియో చూసిన చాలామంది కోతిని( Monkey ) అనవసరంగా విడిపించారని స్థానికులను విమర్శిస్తున్నారు.ఇది ప్రకృతి ధర్మం అని, పాము నోటి దగ్గర నుంచి ఆహారం లాగేసుకోవడమే అవుతుందని కామెంట్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం కోతి రక్షించమని ఎంతో వేడుకుందని, మానవత్వం గల ఎవరైనా సరే ఆ సమయంలో దానిని విడిపించడం కోసమే ప్రయత్నిస్తారని, అదే న్యాయమని అంటున్నారు.
ఈ వైరల్ వీడియోకి ఇప్పటికే 8 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోను మీరు కూడా చూడండి.







