దుమ్ములేపుతున్న 'తొలిప్రేమ' రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్..ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందంటే!

పవన్ కళ్యాణ్( Pawan kalyan ) కి నేడు యూత్ లో ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి, ఎన్నేళ్లు అయినా, ఎన్ని ఫ్లాప్స్ పడినా చెక్కుచెదరని ఫ్యాన్ బేస్ రావడానికి మూలస్థంభం లాగ నిల్చిన చిత్రం ‘తొలిప్రేమ( Tholi Prema )’.అప్పటి వరకు కేవలం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే ఇండస్ట్రీ లో కొనసాగిన పవన్ కళ్యాణ్.

 Pawan Kalyan Tholi Prema Re-release Advance Bookings, Pawan Kalyan , Tholi Prema-TeluguStop.com

ఈ సినిమా తో తనకంటూ ఒక గుర్తింపు ని తెచ్చుకొని, స్టార్ హీరో గా ఎదిగాడు.ఆ తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

వరుసగా తమ్ముడు, బద్రి మరియు ఖుషి వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి.టాలీవుడ్ లో తిరుగులేని యూత్ ఐకాన్ గా పవన్ కళ్యాణ్ ని నిలబెట్టాయి ఈ సినిమాలు.

అయితే ఎన్ని సూపర్ హిట్స్ వచ్చినా కూడా తొలిప్రేమ చిత్రం కి ఉన్న ప్రత్యేకత వేరే, ఇప్పటికీ కూడా ఈ సినిమా మనకి చాలా ఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది.

Telugu Tholi Prema, Advance, Jalsa, Kushi, Pawan Kalyan, Simhadri, Tollywood-Mov

అలాంటి సినిమా ఈ నెల 30 వ తారీఖు తో విడుదలై 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది.ఈ సందర్భంగా ఈ సినిమాని శ్రీ మాతా క్రియేషన్స్ సంస్థ వారు ‘తొలిప్రేమ’ సినిమాని రీ మాస్టర్ చేయించి గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.

ముఖ్యంగా ఈ సినిమాకి హైదరాబాద్ నుండి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు మొదట మూడవ పార్టీ కి చెందిన సినిమా అని రీ రిలీజ్ చేసేందుకు ఒప్పుకోలేదు.

ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తాము అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ట్రెండింగ్ కూడా చేసారు.కానీ శ్రీమాత క్రియేషన్స్ వాళ్ళు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వచ్చిన లాభాల్లో కొంత భాగం జనసేన పార్టీ కి డొనేట్ చేస్తాము అని చెప్పడం తో పవన్ ఫ్యాన్స్ కొంతమంది సపోర్టు చేసారు కానీ, జల్సా మరియు ఖుషి( Kushi ) చిత్రాలకు సపోర్ట్ చేసిన రేంజ్ లో ఈ సినిమాకి చెయ్యలేదు.

Telugu Tholi Prema, Advance, Jalsa, Kushi, Pawan Kalyan, Simhadri, Tollywood-Mov

అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాకి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.వింటేజ్ పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూసేందుకు ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు?, అనే మాటని నిజం చేసింది ఈ చిత్రం.ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్ సిటీ నుండే ఈ సినిమాకి 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట.సినిమా విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్నందున, ఇంకా ఈ సినిమాకి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో టాప్ 3 గా ఉన్న చిత్రాలు ‘ఖుషి‘, ‘సింహాద్రి’ మరియు ‘జల్సా’.ఈ మూడు సినిమాలే మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలు, ఇప్పుడు తొలిప్రేమ చిత్రం ఏ స్థానం లో నిల్చుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube