పుష్ప రాజ్ ను మాములుగా వాడట్లేదుగా.. మాస్క్ తీసేదేలే అంటూ?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ,రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన పుష్ప సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.

అన్ని భాషలలో ఈ సినిమా ప్రదర్శితం అవుతూ.

అత్యధిక వసూళ్లు రాబట్టింది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో కొన్ని డైలాగులు ప్రజలలో అవగాహన కోసం పోలీసులు ఉపయోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు పుష్పరాజ్ బండి పై వెళ్తున్న ఫోటోకి హెల్మెట్ పెట్టి వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించిన సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు సైతం పుష్పరాజ్ ను విపరీతంగా వాడుకుంటున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు అల్లు అర్జున్ ఫోటోకి మాస్క్ ఉన్నట్టు మార్ఫింగ్ చేసి  ఆ ఫొటోపై మై మాస్క్ ఉతారేగా నహీ అని క్యాప్షన్ ఇచ్చారు.ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.

Advertisement

కోవిడ్ పై పోరాటం చేయడానికి మాస్క్ మంచి ఆయుధం బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం మర్చిపోకండి అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సినిమా గురించి సినిమాలో డైలాగులను తీసుకుని ఇలా సామాజిక కార్యక్రమాలపై అవగాహన కోసం వీటిని ఉపయోగించడం సర్వసాధారణం అయ్యింది.ఇలా సెలబ్రిటీల ఫోటోలు వీడియోలతో ప్రజలకు అవగాహన కల్పించడం వల్ల వారికి చాలా తొందరగా చేరువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ విధమైనటువంటి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు