ఓవర్సిస్ లో పుష్పరాజ్ మ్యానియా.. 2 మిలియన్ కు దగ్గరలో..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మ్యానియా మొత్తం చూపిస్తున్నాడు.ఈయన తాజాగా నటించిన చిత్రం పుష్ప.

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ పాన్ ఇండియా సినిమా కోసం బన్నీ అభిమానులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించి ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్ల వేట కొనసాగిస్తుంది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో విడుదల చేయగా విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకు పోతుంది.అంతటా ఒకేలాగా అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Advertisement

ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్ గురించి ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆయన నటన చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది.ఇక ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్న ఈ సినిమా ఓవర్సిస్​ లో కూడా తన మ్యానియా చూపిస్తుంది.

యూఎస్ లో పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంది.అక్కడ కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా 1.90 మిలియన్ డాలర్లతో దూసుకుపోతుంది.ఇక త్వరలోనే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి అడుగు పెట్టనుంది.

దీనికి కూడా ఎంతో సమయం పట్టేలా లేదు.కరోనా తర్వాత ఇంత కలెక్షన్లు రాబట్టిన సినిమా పుష్ప మాత్రమే.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

మరి ఈ కలెక్షన్ల వేట ఎప్పటితో ముగుస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు