జై లవకుశ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ టీజర్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందనలు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2.కాగా 2021 లో విడుదల అయిన పుష్ప 1 కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 Pushpa 2 Teaser Breaks Jai Lava Kusa Record, Pushpa 2, Jai Lava Kusa, Rashmika M-TeluguStop.com

ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉంది.

అయితే ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప టీజర్ ని చేశారు మూవీ మేకర్స్.ఈ టీజర్ విడుదల తర్వాత మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

రోజు రోజుకీ ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

ఇటీవల విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.110 మిలియన్ కి పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప-2 టీజర్ ( Pushpa-2 Teaser )ఏడేళ్లుగా జై లవ కుశ( Jai lava kusa ) పేరు మీదున్న అరుదైన రికార్డును బ్రేక్ చేసింది.అయితే ఒకప్పుడు సినిమా వసూళ్ల రికార్డులను మాత్రమే పట్టించుకునేవారు.

కానీ ఈ డిజిటల్ యుగంలో టీజర్, ట్రైలర్ రికార్డులను కూడా పట్టించుకుంటున్నారు.ఈ క్రమంలో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ మూవీ టీజర్ యూట్యూబ్ లో ఒక రికార్డు క్రియేట్ చేసింది.

టాలీవుడ్ చరిత్రలోనే ఏకంగా 137 గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది.ఇప్పుడు ఆ రికార్డును ఏడేళ్ల తర్వాత పుష్ప-2 బ్రేక్ చేసింది.పుష్ప-2 టీజర్ 138 గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయింది.సినిమా విడుదల కాకుముందే ఇలా రికార్డుల మీద రికార్డులు సృష్టింతుండటంతో సినిమా విడుదల తర్వాత ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube