పుష్ప 2 రిలేజ్ డేట్ ఫిక్స్.. పండుగ చేసుకుంటున్న అల్లు అర్జున్ అభిమానులు?

అల్లు అర్జున్,( Allu arjun ) సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా గురించి మనందరికీ తెలిసిందే.2021 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కోటలో కలెక్షన్స్ ని సాధించింది.అంతేకాకుండా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది.ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా వచ్చిన తెలిసిందే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ నటుడిగా మొట్టమొదటి అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.ఇక ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం పుష్ప 2 సినిమా( pushpa 2 )ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

 Pushpa 2 Release Date Fix, Pushpa 2, Release Date Fix, Tollywood, Allu Arjun, R-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Telugu Allu Arjun, Pushpa, Fix, Sunil, Tollywood-Movie

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.వచ్చే ఏడాది అనగా 2024 మార్చి 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Allu Arjun, Pushpa, Fix, Sunil, Tollywood-Movie

అయితే మార్చి 22 శుక్రవారం వచ్చింది.ఆ తర్వాత వీకెండ్ మూవీకి హెల్ప్ అవుతుంది.ఆ తర్వాత వెంటనే హోలీ, ఆ తర్వాత వెంటనే గుడ్ ఫ్రైడ్ వరసగా వస్తున్నాయి.ఇవి సెలవు దినాలు అవ్వడంతో మూవీకి ప్లస్ అవుతాయి.అక్కడితో అయిపోలేదు.ఆ తర్వాత మళ్లీ వీకెండ్ ఉంది.

వెంట వెంటనే రెండు, మూడు రోజుల గ్యాప్ లో ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి వంటి పండగలు క్యూలో ఉన్నాయి.దాంతో ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ వార్త సోషల్ మీడియాలో వరలవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఇప్పటికే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఫ్యాన్స్ తాజాగా ఈ వార్త వినిపించడంతో మరింత సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube