పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ జన గణ మన సినిమా ఈమధ్యనే స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.లైగర్ తర్వాత రిపీట్ అవుతున్న ఈ క్రేజీ కాంబో సినిమాపై అది కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న జన గణ మన ప్రాజెక్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
పూరీ విజయ్ దేవరకొండ జె.జి.ఎం నుండి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. జె.జి.ఎం సినిమాను ఒక పార్ట్ గా కాకుండా రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.పూరీ జె.జి.ఎం 2 పార్ట్స్ గా ప్లాన్ చేస్తున్నారట.
ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డ్యాషింగ్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.
లైగర్ తో సింక్ కుదరడంతో తన డ్రీం ప్రాజెక్ట్ జన గణ మన సినిమాని కూడా విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు పూరీ.ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
లైగర్ తోనే పూరీ, విజయ్ కాంబో క్రేజ్ ఏంటన్నది తెలుస్తుంది.మరి జె.జి.ఎం ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.జె.జి.ఎం సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది.రెండు పార్టులుగా జన గణ మన అనగానే విజయ్ ఫ్యాన్స్ లో అంచనాలు డబుల్ అయ్యాయి.







