అరాచక పాలన అంటూ ఏపీ ప్రభుత్వం పై పురంధేశ్వరి సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ( Purandheswari )వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అనకాపల్లి జిల్లా బీజేపీ( BJP ) కార్యకర్తల సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు.

 Purandheswari Serious Comments On Ap Government Bjp, Purandheswari , Ap G-TeluguStop.com

ప్రజలు జగన్ నీ గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే.రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతూ.బెదిరించే విధంగా పాలన చేస్తున్నారని విమర్శించారు.

విశాఖ  రైల్వే జోన్ నీ కేంద్రం ప్రకటిస్తే.కనీసం స్థలం కూడా కేటాయించకుండా.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కరువు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించిన గాని రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకోలేదని.

పురంధేశ్వరి విమర్శించారు.రైతాంగం పట్ల వైసీపీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది.

రాష్ట్రంలో నిరుపేదల కోసం 25 లక్షల గృహాలను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 20 శాతం కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోంది.

వైసీపీ ప్రభుత్వం( YCP ) గత నాలుగున్నర ఏళ్లుగా అవినీతిలో కూరుకుపోయిందని.ఆరోపించారు.

ప్రభుత్వ విధి విధానాలు… అవినీతిని ప్రశ్నిస్తే వాటికి జవాబు చెప్పకుండా నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు.వైసీపీ నాయకులు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube