ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి( Daggupati purandareswari ) గత కొద్ది రోజులుగా వైసీపీ పభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడం, కేంద్రం ఇస్తున్న నిధులు విషయమై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, లెక్కలు చెప్పాలంటూ వైసిపి లోని కీలక నేతలందరినీ టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండడం వంటివి వైరల్ గా మారాయి.ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy )జగన్ బెయిల్ రద్దు చేయాలని నేరుగా సిజేఐకు లేఖ రాయడమే కాకుండా, సిబిఐ కోర్టులోనూ పిటిషన్ వేసేందుకు పురందరేశ్వరి సిద్ధం అవుతుండడం తో వైసిపి అగ్ర నేతల్లో ఆందోళన కనిపిస్తుంది .
ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy )ని టార్గెట్ చేసుకుంటూ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
మాజీ మంత్రులు కొడాలి నాని ( kodali Nani )వంటి వారు పురందేశ్వరిపై వ్యక్తిగతంగా ను విమర్శలు చేస్తున్నారు.పురందేశ్వరి తన బావ చంద్రబాబు మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు.టిడిపికి మేలు చేసే విధంగా పురంధరేశ్వరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బిజెపిలోని ఓవర్గం నాయకులు పురందేశ్వరి పై తీవ్రంగా మండిపడుతున్నారు.
అసలు పురందరేశ్వరి బిజెపిలో ఉన్నారా టిడిపిలో ఉన్నారా అని ప్రశ్నలు కూడా వేస్తున్నారు.అయితే గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సోము వీర్రాజు వంటి వారు టిడిపి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే వైసిపి ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ చురకలు అంటించే వారు.
కానీ పురందరేశ్వరి పూర్తిగా వైసిపిని( YCP ) టార్గెట్ చేసుకుని కేంద్రం ఇస్తున్న నిధులు సహాయ సహకారాలను ప్రశ్నిస్తూ వైసిపిని నిలదీస్తున్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించడమే కాకుండా, దీనిపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తుండడం వంటి వ్యవహారాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. గతంలో ఎప్పుడు బిజెపి నుంచి ఈ స్థాయిలో ఎదురు దాడి జరగకపోవడంతో పురంధరేశ్వరి సొంత ఎజెండాతో వైసీపీని టార్గెట్ చేసుకున్నారని, టిడిపికి మేలు చేసే విధంగా ఆమె వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నా, పురందరేశ్వరి దూకుడు కు వైసిపి నేతలు మాత్రం షేక్ అవుతున్నారనే చెప్పాలి
.