ఈ వీడియో చూస్తే.ఒళ్లు గగుర్పాటుకు గురవ్వడం ఖాయం.
ఒక్క క్షణం అటు ఇటు అయినా రెండు ప్రాణాలు పట్టాల కింద నగిలిపోయేవి.సాధారణంగా ప్రమాదాన్ని ఊహించడం ఎవరికైనా కష్టం.
అనుకోకుండానే అప్పుడప్పుడు ప్రమాదంలో పడిపోతుంటాం.అదే జీవితమంటే మరీ.దీంతో వారిని కాపాడానికి పోయి వేరే వారు కూడా ప్రమాదంలో చిక్కుకుంటారు.అలా కాపాడదామని పోయి ప్రమాదంలో చనిపోయిన వారు ఉన్నారు.
ఇలాంటి ఘటనలు తరచూ చూస్తుంటాం.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
పట్టాలపై ఉన్న ఓ కుక్క పిల్లను ప్రాణాలకు తెగ్గించి కాపాడాడు ఓ వ్యక్తి.రెప్పపాటు ఆలస్యమైన ఇద్దరు ట్రైన్‌కు బలి అయ్యేవారు.
వివరాలు ఇలా ఉన్నాయి.ఓ కుక్క పిల్ల ఎలా వచ్చిందో తెలియదు కానీ, రైలు పట్టాలపైకి వచ్చింది.
పట్టాలను దాటుతుండగా కుక్కు పిల్ల మెడకు ఉన్న తాడు పట్టాల్లో ఇరుక్కుంటుంది.అయితే ఎదురుగా ట్రైన్ వేగంగా వస్తుంటుంది.
అయితే ఇంతలోనే ఓ వ్యక్తి పట్టాల మీద నుంచి పరిగెత్తుకుంటూ కుక్క దగ్గరకు వస్తాడు.కుక్క తాడు పట్టాల్లో ఇరుక్కుపోయిందని గమనించి తీయడానికి ప్రయత్నించాడు.
మరోపక్క వేగంగా వస్తున్న ట్రైన్ వీరిని సమీపించింది.ఇంతలోనే తాడును తొలగించి కుక్కపిల్లతో పాటు తాను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
రెప్పపాటు ఆలస్యమైనా కుక్క, మనిషి ఇద్దరిని ట్రైన్ ఢీకొట్టి ఉండేది.దీంతో ఇద్దరు చనిపోయి ఉండేవారు.
అయితే చివరి క్షణాల్లో తాడు రావడంతో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.క్షణం ఆలస్యమైన రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.
అతడి ధైర్యానికి హ్యాట్సాప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మీరు ఈ వీడియోను చూసి కామెంట్ చేయండి.