Goldy Brar Sidhu Moose Wala : సిద్ధూ మూసేవాలా హత్య కేసు : అమెరికా పోలీసులకు చిక్కిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్

కాంగ్రెస్ నేత, పంజాబీ సింగ్ సిద్ధూ మూసేవాలా హత్యకు ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఇతను కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు.

 Punjabi Singer Sidhu Moose Wala Murder Mastermind Goldy Brar Detained In Us , Pu-TeluguStop.com

గోల్డీ బ్రార్ ఇటీవల కెనడా నుంచి యూఎస్‌కి వెళ్లినట్లుగా తెలుస్తోంది.మీడియా కథనాలను బట్టి గోల్డీబ్రార్‌ను నవంబర్ 20న కాలిఫోర్నియా రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

అయితే అక్కడి నుంచి భారత ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందాల్సి వుంది.సిద్ధూ హత్య తర్వాత భారత్‌తో పాటు కెనడా దర్యాప్తు ఏజెన్సీల నిఘా ఎక్కువ కావడంతో గోల్డీ బ్రార్ అమెరికాకు పారిపోయినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అతను ఫ్రెస్నో నగరంలో నివసిస్తున్నాడు.శాక్రమెంటో, ఫ్రిజో , సాల్ట్ లేక్ వంటి నగరాలను మారుస్తూ వున్నట్లుగా సమాచారం.

భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), ఢిల్లీ పోలీస్ నిఘా విభాగం, పంజాబ్‌లోని గోల్డీ బ్రార్ అనుచరులకు అతని అరెస్ట్ పెద్ద సంచలనం కలిగించింది.అయితే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ తరపున ప్రచారం చేస్తోన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.

గోల్డీ బ్రార్ అరెస్ట్‌ను ధృవీకరించారు.ఇటీవల .సిద్ధూ మూసేవాలా తండ్రి గోల్డీ బ్రార్‌పై ఎలాంటి సమాచారం అందించినా వారికి రూ.2 కోట్ల రివార్డ్‌ ప్రకటించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .అమృత్‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బల్కౌర్ సింగ్ మాట్లాడుతూ.పంజాబ్ ప్రభుత్వం ఒకవేళ రివార్డ్ ఇవ్వని పక్షంలో తన సొంత డబ్బయినా ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు.

Telugu Bhagwant Mann, Bishnoi, Goldy Brar, Punjab, Punjabi, Satinder Singh-Telug

ఎవరీ గోల్డీ బ్రార్:

సిద్దూ హత్యతో గోల్డీ బ్రార్ పేరు మారు మోగిపోతోంది.అతను ఎవరు.ఏం చేసేవాడన్న దానిపై నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నాడు.ఇతని అసలు పేరు సతీందర్ సింగ్.పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ ప్రాంతానికి చెందిన వాడు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బిష్ణోయ్ తరపున గోల్డీ బ్రార్ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్‌కి.

మరో గ్యాంగ్‌స్టర్ దవిందర్ బంభిహాకు మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది.పంజాబ్ సహా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి.

గోల్డీ బ్రార్ సన్నిహితుడు మిద్దుఖేరాను బంభిహా గ్యాంగ్ గతేడాది హతమార్చింది.దీనికి ముందు బ్రార్ సమీప బంధువు గుర్లాల్ బ్రార్ కూడా హత్యకు గురయ్యాడు.

ఇతను బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ హత్యకు ప్రతీకారంగా కాంగ్రెస్ నేత గురులాల్ పహిల్వాన్‌ను లారెన్స్ గ్యాంగ్ హత్య చేసింది.ఈ కేసులో కీలక నిందితుడిగా వున్న గోల్డీ బ్రార్ కెనడాకు పారిపోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube