భారత దేశంలో అత్యంత ఖరీదైన రిసార్ట్స్‌లో ఒక్కరోజు స్టే చేయాలంటేనే లక్షల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.అదే మూడు రోజులు ఉంటే మూడు లక్షల దాకా ఫీల్ అవుతుంది అయితే పుణెకి( Pune ) చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ ప్రీతి జైన్( Priti Jain ) మాత్రం పైసా కూడా చెల్లించకుండా ఒక ఖరీదైన మారియట్ రిసార్ట్‌లో మూడు రోజులు ఉచితంగా స్టే చేసింది.
ఈ విషయాన్ని ఆమే ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించింది.దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను( Credit Card Reward Points ) ఉపయోగించి ఉత్తరాఖండ్‌లోని ఒక ఖరీదైన మారియట్ రిసార్ట్‌లో మూడు రోజులు ఉచితంగా బస చేసింది.
ఆమె తన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినమ్ కార్డ్‌తో రూ.4 లక్షలు ఖర్చు చేసి 58,000 రివార్డ్ పాయింట్లు సంపాదించింది.ఈ నాలుగు లక్షల ఆమె తన అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేసింది.
దాని ద్వారా వచ్చిన ఈ పాయింట్లను ఆమె మారియట్ బోన్వాయ్( Marriott Bonvoy ) పాయింట్లుగా మార్చింది.మారియట్ బోన్వాయ్ అనేది హోటళ్లలో ఉండటం, ఇతర ప్రయాణ అనుభవాల కోసం ఉపయోగించే రివార్డ్స్ ప్రోగ్రామ్.
ఈ పాయింట్లను అవసరమైనప్పుడు కొనుగోలు చేయవచ్చు.
ప్రితి జైన్ తన ఎక్స్‌లో తన హోటల్ స్టేను మరింత అద్భుతంగా మార్చారని తెలిపింది.మొదటి రోజు ఆమెను సాధారణ గది నుంచి ప్రీమియర్ రూమ్‌కి మార్చారు.తర్వాతి రెండు రోజులు ఆమె ఎగ్జిక్యూటివ్ సూట్‌లో ఉండే అవకాశం లభించింది.సూట్ కోసం ఒక రాత్రికి రూ.90,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పింది.అక్కడ ఒక రాయల్ మెంబర్ లాగా తాను ఫీల్ అయినట్లు తెలిపింది.
మారియట్ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్, హై-టీ అందించింది.అంతేకాకుండా, ప్రతి సాయంత్రం నది ఒడ్డున డెక్‌పై గంగా ఆర్తిని నిర్వహించారు.“అక్కడ లైవ్ మ్యూజిక్, రుచికరమైన ఆహారం, అన్ని అతిథులకు ప్రశాంత వాతావరణం ఉంది” అని ఆమె చెప్పారు.ప్రీతి జైన్ మారియట్ బోన్వాయ్ పాయింట్లతో ఆమె రూ.1.5 లక్షల విలువ చేసే మూడు రోజుల హోటల్ స్టేను బుక్ చేసుకుంది.హోటల్ వారు ఆమెకు ఉచిత అల్పాహారం, మరింత ఖరీదైన సూట్‌ను ఇచ్చిన తర్వాత, ఆమె స్టే మొత్తం విలువ రూ.3 లక్షలకు చేరుకుంది.ఈ విషయాన్ని ఆమె “అద్భుతమైన డీల్” అని పిలిచింది.
గత నెలలో, మరొక క్రెడిట్ కార్డ్ వినియోగదారు తన కుటుంబంతో కెన్యాలోని మసై మారా అనే జంతు సంరక్షణ కేంద్రానికి లగ్జరీ ట్రిప్ వెళ్లారు.అక్కడ ఉన్న జెడబ్ల్యూ మారియట్ లాడ్జ్‌లో ఐదు రోజులు ఉండడానికి రూ.27.5 లక్షల విలువ చేసే స్టేను రివార్డ్ పాయింట్లతోనే కవర్ చేసుకున్నారు.