ఢిల్లీ యూనివర్సిటీలోని ఇంద్రప్రస్థ మహిళా కళాశాలలో( Indraprastha College for Women ) ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.ఇక్కడ చదువుతున్న శ్రీయా రథి అనే విద్యార్థిని డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
ఆమె డ్యాన్స్( Dance ) చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే సౌండ్ సిస్టమ్ మొరాయించింది.స్పీకర్( Speaker ) నుంచి సరిగా పాట వినిపించలేదు.
దాంతో ఆమె డాన్స్ ఆపాలనుకుంది.అంతలోనే ప్రేక్షకులు ఆమె కోసం అదే పాటను కలిసి పాడటం ప్రారంభించారు.
ఈ హార్ట్ టచింగ్ మూమెంట్స్ విద్యార్థులు వీడియో రికార్డ్ చేశారు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పీకర్ లో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లం ఎలాంటి అడ్డంకిగా మారకుండా ప్రేక్షకుల మద్దతుతో శ్రీయా రథి డాన్స్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ గా ఇచ్చింది.

ప్రముఖ పాటైన ‘అఫ్రీన్ అఫ్రీన్’ పాటను ఆడియన్స్ కలిసి చాలా చక్కగా పాడారు.ఆమె డ్యాన్స్ పర్ఫామెన్స్‌ను మరింత అద్భుతంగా మార్చారు.శ్రీయా( Shriya ) స్వయంగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఇప్పటికే 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
వీడియోలో శ్రీయా నృత్యం చేస్తుండగా, ప్రేక్షకులు( Audience ) ఉత్సాహంగా పాట పాడుతున్న దృశ్యం చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది.శ్రీయా తన వీడియో క్యాప్షన్‌లో “స్పీకర్స్ ఆగిపోయాయి కానీ ప్రేక్షకులు ఆగలేదు” అని రాసింది.

అమ్మాయిల మధ్య స్నేహం ఇంతలా ఉంటుందా అని వీడియో చూసిన చాలామంది కామెంట్లు చేశారు.ఒక యూజర్ “ప్రేక్షకులు పాడటం మొదలుపెట్టినప్పుడు నువ్వు నృత్యం చేయాలని నిర్ణయించుకున్న క్షణం అద్భుతం.” అని కామెంట్ చేశారు.ప్రముఖ డ్యాన్సర్ ఫైసల్ ఖాన్ కూడా ఈ వీడియోకి హార్ట్ ఎమోజీతో స్పందించారు.
చాలా మంది యూజర్లు ఇది ఏ కళాకారిణికి అయినా డ్రీమ్-లైక్ ఎక్స్‌పీరియన్స్ అని అన్నారు.







