పురుషుల్లో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టే అద్భుత‌మైన‌ నూనె ఇదే!

స్త్రీలే కాదు.హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో బాధ ప‌డే పురుషులూ ఎంద‌రో ఉన్నారు.

వ‌య‌సు పైబ‌డిన త‌ర్వాత జుట్టు ఊడుతున్నా పురుషులు పెద్ద‌గా ప‌ట్టించుకోరు.కానీ, పెళ్లి కాకుండానే హెయిర్ ఫాల్ వేధిస్తుంటే అంత‌కంటే న‌ర‌కం వారికి మ‌రొక‌టి ఉండ‌దు.

ఈ క్ర‌మంలోనే జుట్టు రాల‌కుండా ఉండేందుకు ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఖ‌రీదైన షాంపూల‌ను యూజ్ చేస్తారు.

మందులు కూడా వాడ‌తారు.అయిన‌ప్ప‌టికీ హెయిర్ ఫాల్‌కి అడ్డు క‌ట్ట ప‌డ‌కుంటే మాన‌సికంగా కృంగి పోతుంటారు.

Advertisement

అయితే పురుషుల్లో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్ట‌డంలో గుమ్మ‌డి గింజ‌ల నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఈ నూనెలో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు జుట్టు కుదుళ్ల‌కు బ‌లాన్ని చేకూర్చి రాల‌డాన్ని నివారిస్తాయి.

మ‌రి ఇంత‌కీ గుమ్మ‌డి గింజ‌ల నూనెను జుట్టుకు ఎలా ఉప‌యోగించాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బ‌రి నూనె, ఒక స్పూన్ గుమ్మ‌డి గింజ‌ల నూనె, ఒక స్పూన్ స్వ‌చ్ఛ‌మైన తేనె  వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు మొత్తానికి ప‌ట్టించి.గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే హెయిర్ ఫాల్ స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డుతుంది.అలాగే ఒక బౌల్‌లో రెండు స్పూన్ల గుమ్మ‌డి గింజ‌ల‌ నూనెను వేసి డ‌బుల్ బాయిల‌ర్ ప‌ద్ధ‌తిలో హీట్ చేయాలి.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
ఉత్తరప్రదేశ్‌లో 5 ఏళ్ల బాలుడిపై కోతుల దాడి.. వీడియో వైరల్

ఇప్పుడు ఈ నూనెను గోరు వెచ్చ‌గా మార్చి.ఆపై జుట్టుకు అప్లై చేసుకుని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.రాత్రి నిద్రించే ముందు ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే గ‌నుక జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా, స్ట్రోంగ్‌గా పెరుగుతుంది.

Advertisement
" autoplay>

తాజా వార్తలు