ఆ గ్రామాన్ని పెన్సిల్ విలేజ్ అని ఎందుకు పిలుస్తారంటే..

కాశ్మీర్‌లోని పుల్వామా పరిధిలో గల ఊఖు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది.జీలం నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో రంపపు మిల్లులు అనేకం కనిపిస్తాయి.

 Pulwama In Kashmir Is Called As Pencil Village Details, Pencil Village, Pulwama,-TeluguStop.com

ఈ గ్రామంలో కేవలం 250 మంది మాత్రమే నివసిస్తున్నారు.ఇది దేశవ్యాప్తంగా పెన్సిల్ విలేజ్‌గా పేరొందింది.

ఈ గ్రామంలో పురాతన పలకల తయారీ యూనిట్ 2013లో స్థాపించారు.కాశ్మీర్ లైఫ్ తెలిపిన వివరాల ప్రకారం జీలం ఆగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటుకుమందు ఇక్కడ నుంచి జమ్మూ, చండీగఢ్‌లకు కలప దుంగలు తరలించేవారు.

జీలం ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రమోటర్ మంజ్రు అహ్మద్ అలై మాట్లాడుతూ, ఇంతకుముందు తాము హిందుస్థాన్ పెన్సిల్స్‌కు లాగ్‌లను పంపేవారమని తెలిపారు.స్థానికంగా ఉన్న ఒక కలప వ్యాపారి సామిల్ యూనిట్‌ను ప్రారంభించి యాపిల్ పండ్ల బాక్సులను తయారు చేశాడు.

అయితే ఆ వ్యాపారం నష్టాలపాలయ్యింది.2012లో ఒకసారి అతను జమ్మూలో పెన్సిల్ తయారీదారులను కలిశాడు.వారిని పెన్సిల్స్ తయారీకి ముడిసరుకును అందించమని అడిగాడు.ఇక్కడి నుంచే పెద్ద మార్పుకు పునాది పడింది.పెన్సిల్ పరిశ్రమకు ముడిసరుకు అవసరం మరింతగా పెరిగింది.క్రమంగా వారి కుటుంబం అంతా పెన్సిల్ ఉత్పత్తులను ప్రారంభించింది.

ఆ తర్వాత అతను 15 మంది స్థానికులకు ఉపాధి కల్పించాడు.జనరేటర్‌ను అమర్చడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ నుండి రుణం పొందాడు.

Telugu Jammu Kashmir, Kashmir, Pencil, Pencil Kashmir, Poppler Tress, Pulwama, R

దీంతో వారి పని మరింతగా మెరుగుపడింది.కాశ్మీర్‌లోని పోప్లర్ చెట్ల కలప పెన్సిల్స్‌కు ముడి పదార్థంగా చాలా అనుకూలంగా ఉంటుంది.దీనిని పోప్లర్ అని కూడా పిలుస్తారు.కాశ్మీర్‌లో పోప్లర్ చెట్లు విస్తారంగా ఉన్నాయి.ఇంతేకాకుండా రష్యన్ పాప్లర్ అని పిలిచే బల్గేరియన్ కలప కూడా ఇక్కడ లభ్యమవుతుంది.కాశ్మీరీ పోప్లర్లలో తేమ అధికంగా ఉంటుంది.

ఫలితంగా అది మృదువుగా మారుతుంది.పోప్లర్ చెట్టు కలపను సేకంచాక దానిని రంపపు మిల్లుకు పంపిస్తారు.

అక్కడ వాటిని పెన్సిళ్లకు అనువుగా మారుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube