ప్రభాస్ హీరో పృథ్వీరాజ్ విలన్.. ఆ సీన్లు చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ ఒక పార్ట్ గా తెరకెక్కుతుందో లేక రెండు భాగాలుగా తెరకెక్కుతుందో స్పష్టత లేదు.అయితే సలార్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో రిలీజవుతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

 Pruthwiraj Sukumaran Shocking Update About Prabhas Movie Salaar Details, Prabhas-TeluguStop.com

సలార్ పార్ట్1 క్లైమాక్స్ లోనే సెకండ్ పార్ట్ గురించి స్పష్టత వస్తుందని అప్పటివరకు ఈ సీక్రెట్ ను మేకర్స్ రివీల్ చేయరని సమాచారం.

కథ పరంగా సలార్ రెండు భాగాలుగా తెరకెక్కించాల్సిన సబ్జెక్ట్ కావడంతో ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలను చూసిన ప్రేక్షకులు ఏ స్థాయిలో అంచనాలను పెట్టుకున్నా అస్సలు నిరుత్సాహపరచనని ప్రశాంత్ నీల్ నమ్మకంతో ఉన్నారు.సలార్ మూవీ ఫస్ట్ పార్ట్ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 9 నెలల సమయం ఉంది.

ప్రశాంత్ నీల్ ఈ సినిమా పబ్లిసిటీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

అయితే ప్రశాంత్ నీల్ రిక్వెస్ట్ వల్ల ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్లు ఇస్తూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నారు.సలార్ సినిమాలో ప్రభాస్ హీరో కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.తనది నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని అయితే ఈ రోల్ ప్రత్యేకంగా ఉంటుందని పృథ్వీరాజ్ సుకుమారన్ చెబుతున్నారు.

ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఈ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఈ సీన్లు ఉంటాయని సమాచారం.ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించడం బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాకు హెల్ప్ అవుతోంది.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ బ్యానర్ వరుస విజయాలతో చరిత్ర సృష్టిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube