గులాబీ పూలకు( rose flowers ) ఏడాది పొడవునా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.ఇక పెళ్లిల సీజన్లో, పండగల సమయంలో ఈ పూలకు గిరాకీ చాలా ఎక్కువ.
కాబట్టి ఈ గులాబీ పూల సాగుపై అవగాహన తెచ్చుకుంటే అధిక దిగుబడి పొందడంతో పాటు అధిక లాభాలను అర్జించవచ్చు.వ్యవసాయ రంగంలో ఏ పంటలు పండించిన ముందుగా ఆ పంటలపై అవగాహన లేకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.
అదే అవగాహన ఉంటే అధిక దిగుబడిని సులభంగా పొందవచ్చు.గులాబీ పంట సాగుకు తేమశాతం తక్కువగా ఉండి, రాత్రి పూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి.
అంటే పగటిపూట ఉష్ణోగ్రతలు 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్, సమయంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ ప్రాంతాలలో ఈ గులాబీ పంట సాగు చేయవచ్చు.

గులాబీ పూల సాగులో కొమ్మల కత్తిరింపులు అనేది తప్పనిసరి.గులాబీ పూలకు కొత్త చిగుర్లు వస్తాయి.గులాబీ మొక్కకు గాలి, సూర్యరశ్మి బాగా తగలాలంటే కొమ్మల కత్తిరింపులు చేయాల్సిందే.
వర్షాకాలం అనంతరం అక్టోబర్, నవంబర్ నెలలో కొమ్మల కత్తిరింపులు చేయాలి.ఒకవేళ హైబ్రిడ్ రకాల( Hybrid types ) ను సాగు చేస్తే పూత వచ్చే 45 రోజుల ముందు ఈ కొమ్మల కత్తిరింపులు జరపాలి.
ఎండిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి.

గులాబీ మొక్కలు గుబురు గా ఉండేటట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.గుబురు గా ఉండే మొక్కలకు అధికంగా పూలు పూస్తాయి.మొగ్గలు వచ్చే దశలో అందించాలి.
కాండపు చివర్లు అధికంగా పెరగకుండా కత్తిరించాలి.బలహీనంగా ఉండే కొమ్మలను కూడా కత్తిరించాలి.
గులాబీ మొక్కలపై నీటిని స్ప్రే చేయడం వల్ల దుమ్ము ధూళి, వేడి నుంచి రక్షణగా ఉంటుంది.వేసవికాలంలో క్రమం తప్పకుండా పొద్దున సాయంత్రం నీటిని అందించాలి.
గులాబీ మొక్కలకు చీడపీడల బెడద లేకుండా ఉండాలంటే వేపాకును నీటిలో మరిగించి ఆ నీటితో మొక్కలపై పిచికారి చేయాలి.అయినా కూడా చీడపీడల బెడద ఉంటే రిడోమిల్, దితానే ఎమ్ 45 వంటి మందులను పిచికారి చేయాలి.