అరటి ఉష్ణ మండల పంట.ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంటే నాణ్యమైన అధిక దిగుబడి సాధించవచ్చు.
వేసవికాలంలో అరటి తోటలను( Banana Crop ) సాగు చేస్తే బిందు సేద్యం ద్వారా నీటి తడులు అందించాలి.వర్షాకాలం లేదంటే శీతాకాలంలో సాగు చేస్తే నీటిని ఎలా అందించిన పర్వాలేదు.
అరటి చెట్టుకు గెల వచ్చే దశలో ఒక్కొక్క చెట్టుకు 25 కిలోల ఆవుల పేడ, 100 గ్రాముల పొటాష్, 200 గ్రాముల యూరియా ఎరువులు( Urea ) అందిస్తే నాణ్యమైన అరటి గెలలు పొందవచ్చు.
అరటిలో అధిక దిగుబడును సాధించాలంటే.
కర్పూర చక్కెర కేళి, తెల్ల చక్కెర కేళి, అమృతపాణి, వామన కేళి లలో ఏదో ఒకదానిని సాగుకు ఎంపిక చేసుకొని సాగు చేపట్టాలి.తెగులు నిరోధక, ఆరోగ్యకరమైన పిలకదుంపలను ఎంపిక చేసుకోవాలి.
పిలక మొక్కపై భాగంను నరికి నాటితే అవి త్వరగా నాటుకొని బాగా పెరుగుతాయి.

అరటి తోటలను ఆశించి తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే పనామా తెగులు( Panama Pests ) కీలక పాత్ర పోషిస్తాయి.పంట మార్పిడి చేయకుండా అరటిని పండించడం, అధిక ఉష్ణోగ్రతలు, నీటిపారుదల సరిగా లేకపోవడం, పొలంలో అధిక తేమశాతం ఉండడం లాంటి వాటి వల్ల అరటి మొక్కలు పనామా తెగుల బారిన పడతాయి.ఈ తెగుళ్లు మట్టి ద్వారా అరటి మొక్క వేరులోకి ప్రవేశిస్తుంది.
ముఖ్యంగా నీటిపారుదల సక్రమంగా లేకపోతే ఈ తెగుళ్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

ఈ తెగుళ్లు సోకిన అరటి మొక్కల( Banana Plants ) ఆకులు పసుపు రంగులోకి మారి వాడి పోతాయి.అరటి మొక్క కండంపై ఎర్రటి చారలు ఏర్పడితే ఆ మొక్కకు ఈ తెగుళ్లు సోకినట్టే.ఈ తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటే మొక్కలను తొలగించి నాశనం చేయాలి.
అరటి మొక్క పునాది దగ్గర సున్నం నీటిని చల్లడం వల్ల ఈ తెగులు రాకుండా నిరోధించవచ్చు.అరటి పంట కోతల తర్వాత పంట మార్పిడి చేయాలి.10 గ్రాముల కార్బండిజంను 10 లీటర్ల నీటిలో కలిపి అరటి పిలకలపై పిచికారి చేయాలి.మట్టిలో సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ లాంటి బయో ఏజెంట్లను ఉపయోగించడం వల్ల పనామా తెగులను పూర్తిగా నివారించవచ్చు.