ప్రత్తి పంటను( Cotton Crop ) ఆశించే తెల్ల దోమలు మొక్కలో ఉండే ద్రవ్యాన్ని పీల్చి, వాటి లాలాజలం ద్వారా విషా రసాయనాలను మొక్కలోకి ప్రవేశపెడతాయి.దీంతో మొక్క కిరణజన్య సంయోగ క్రియ( Photosynthesis ) చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది.
వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత లేదంటే అధిక తేమశాతం ఉన్నప్పుడు ఈ దోమల ఉధృతి అధికం అయ్యే అవకాశం ఉంది.తక్కువ ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు ఉంటే ఈ దోమల వ్యాప్తి తక్కువగా ఉంది.
ఈ తెల్ల దోమలు ఆశించిన మొక్కల ఆకులు ముందుగా పసుపు రంగులోకి మారి ఆ తర్వాత గోధుమ రంగులోకి మారుతాయి.ఆకుల అంచుల నుండి మధ్య ఈనె వైపుకు రంగు మారుతుంది.
దీంతో ఆకులు ఎండిపోయి( Dried Leaves ) ముడుచుకుపోతాయి.ఒకవేళ లేత మొక్కలకు ఈ తెల్ల దోమలు ఆశించినట్లయితే మొక్కల పెరుగుదల ఆగిపోతుంది.
ఒకవేళ పంట చివరి దశలో ఉన్నప్పుడు ఈ దోమలు ఆశిస్తే పంట నాణ్యత క్షీణిస్తుంది.

తెగుళ్లను( Pests ) తట్టుకునే తెగులు నిరోధక మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.అధిక మొత్తంలో ఒకేసారి నత్రజనిని ఉపయోగించకుండా సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి.మొక్కల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
సేంద్రీయ పద్ధతిలో ఈ తెల్ల దోమలను అరికట్టాలంటే.లేస్ వింగ్ కీటకాలు ఓరియస్ లేదా జియోకోరిస్ అనే జాతులకు చెందిన కీటకాలు ఉపయోగించాలి.

కీటకాలు తెల్ల దోమలను ఆహారంగా తీసుకుంటాయి.రసాయన పద్ధతిలో ఈ తెల్ల దోమలను( White Flies ) అరికట్టాలంటే.ఒక మిల్లీలీటర్ మలాథియాన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.లాంబ్డా-సైహాలోత్రిన్ ఒక మిల్లీలీటర్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ తొలి దశలోనే అరికడితే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.








