కామిక్ కాన్ లో ఎంటర్ అయిన 'ప్రాజెక్ట్ కే' టీమ్.. ఆర్మీ లుక్ తో క్రేజీగా వెల్కమ్!

గత కొద్దీ రోజుల నుండి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే( Project K ) తరచు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

ఎప్పుడైతే ఇంటర్నేషనల్ సంస్థ శాన్ డియాగో కామిక్ కాన్ అనే ఈవెంట్ లో చోటు సంపాదించుకుంది అని ప్రకటన వచ్చిందో అప్పటి నుండి ప్రాజెక్ట్ కే పేరు మారుమోగి పోతుంది.

ఇక ఈ రోజే అక్కడ ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది.

ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ కే టీమ్ మొత్తం ఎంతో ఆసక్తికాగా ఎదురు చూస్తున్న తరుణం రానుంది.ఈ భారీ మూవీ ప్రధాన టీమ్ అంతా ఈ ఈవెంట్ కోసం హాజరు అవుతున్నారు.ఇదే ఈవెంట్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను రివీల్ చేయనున్నారు.

అందుకే ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) తో పాటు యావత్ ఇండియా మొత్తం మన తెలుగు సినిమా ప్రాజెక్ట్ కే కోసం హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.ఇక ఇది వరకే ఈ సినిమా నుండి ప్రాజెక్ట్ కే స్క్రాచ్ నుండి అని ఈ సినిమాలో సైన్యంకు సంబంధించిన సెట్ వర్క్స్ రిలీజ్ చేసారు.

Advertisement

ఇక ఇప్పుడు యూఎస్ లో తమ యూనిట్ కామిక్ కాన్ ఎసెంట్ దగ్గర తమ ఆర్మీ తాలూకా లుక్( Army Look ) ను అక్కడ రివీల్ చేశారు.తమ సినిమాకు వెల్కమ్ చెప్తూ వారి సూట్ లో కనిపించి సర్ప్రైజ్ చేసారు.

ఇన్ని అంచనాలను క్రియేట్ చేస్తున్న నాగ్ అశ్విన్ సినిమాను వేరే లెవల్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ రోజే యూఎస్ లో ఈ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ Project K Title Teaser ) కానుండగా రేపు ఇండియాలో రాబోతుండడంతో ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఇక ఇందులో దీపికా పదుకొనె, బిగ్ బి, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అయిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్( Vyjayanthi Movies Banner )< పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు