కేటీఆర్ కి ప్రొఫెసర్ కోదండరామ్ కౌంటర్..!!

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్( Kodandaram, Aamir Ali Khan ) ఎన్నిక కావడం తెలిసిందే.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది.

 Professor Kodandaram Expressed His Anger On Ktr , Professor Kodandaram, Ktr , Ko-TeluguStop.com

ఆ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.గవర్నర్ ది పక్షపాత వైఖరి అని అన్నారు.

గవర్నర్ ప్రజలకే బాధ్యులు తప్ప సీఎంకు కాదని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో పోరాడిన దాసోజు శ్రవణ్, ఏరుకుల కులానికి చెందిన సత్యనారాయణను గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేస్తే వారికి రాజకీయ సంబంధాలు ఉన్నాయని రిజెక్ట్ చేసినా గవర్నర్.

ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ పేరును ఎలా ఆమోదిస్తారో చెప్పాలని కేటీఆర్( KTR ) కామెంట్ చేశారు.

దీంతో తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కోదండరామ్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.

తన ఎమ్మెల్సీ ఎంపికను అనవసరంగా వివాదం చేయొద్దని అన్నారు.ప్రజలకు అని తెలుసు అని స్పష్టం చేశారు.“రాజ్యాంగంలో షరతులు అర్థమైతే చర్చ ఉండదు.జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం ఉండదు.

రాజ్యాంగపరంగా సేవ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారు.నేను సుదీర్ఘకాలం సేవ చేశా.

నా ఎంపికను వివాదం చేయటం తగదు.ప్రజలకు అన్ని తెలుసు వారే అంచనా వేసుకుంటారు” అని కోదండరామ్.

కౌంటర్ ఇవ్వడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube